మాలల సింహగర్జన విజయవంతం చేయాలి : తొగరు సుధాకర్

  •  మందమర్రి, రామకృష్ణాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాలల సింహగర్జన సభ పోస్టర్ల ఆవిష్కరణ 

కోల్​బెల్ట్, లక్ష్మణ చాంద, కాగ జ్ నగర్, ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలుగు:  డిసెంబర్ 1న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభను సక్సెస్ చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పోస్టర్లు రిలీజ్ చేశారు. మంచిర్యాల జిల్లా మాలల జేఏసీ కన్వీనర్ తొగరు సుధాకర్ సోమవారం మందమర్రి పట్టణం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్​ విగ్రహం వద్ద, రామకృష్ణాపూర్​పట్టణంలోని రాజీవ్​చౌక్​ వద్ద మాలల సింహగర్జన బహిరంగసభకు సంబంధించిన పోస్టర్లను వేర్వేరుగా ఆవిష్కరించారు.

కో- కన్వీనర్లు  జూపాక సుధీర్, పలిగిరి కనకరాజు, గజేల్లి లక్ష్మణ్,కుంభాల రాజేశ్, మందమర్రి, రామకృష్ణాపూర్​ టౌన్​ ప్రెసిడెంట్లు దాసరి రాములు, నల్లాల మురళీ, జిల్లా గౌరవ అధ్యక్షులు బైరిమల్ల మోగిలయ్య, జిల్లా కార్యదర్శి గోకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  సోమవారం కౌటాల మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్ లో మాలల సింహగర్జన పోస్టర్ లను మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్  విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న మాల కులస్థులకు మేలు చేసేందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న ప్రయత్నం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ సుభాష్, నాయకులు ఎడ్ల శ్రీనివాస్, పత్తి మల్లేశ్, మొగిలి వెంకటేశ్, జయదేవ్,  నర్సయ్య, కడారి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘మాలల సింహగర్జన’  సభను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా కన్వీనర్ బత్తుల రంజిత్ కోరారు.  సభ నిర్వహణకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.  సికింద్రాబాద్ పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్ లో డిసెంబర్ 1న నిర్వహించే మాలల సింహగర్జన సభకు రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జూ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ని మాల నాయకులు ఆహ్వానించారు.  ఎమ్మెల్యేకు అంబేద్కర్ ఫొటో  అందించి ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ నాయకులు రాజేశ్వర్, నేత శ్యామ్, రాజన్న, అశోక్, సతీశ్, సురేశ్, శ్రీహరి ఉన్నారు.