ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు : వాకిటి శ్రీహరి

సిద్దిపేట టౌన్, వెలుగు: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నీలం మధు అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస్ లో సిద్దిపేట జిల్లా ఇన్​చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో మెదక్ కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో పూర్తి అవగాహన ఉన్న అభ్యర్థి నీలం మధు అన్నారు. బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అత్తూ ఇమాముద్దీన్, యాదగిరి, సతీశ్ గౌడ్, ఆనంద్, కలిముద్దీన్, రాములు, లక్ష్మి, బుచ్చిరెడ్డి, గోపికృష్ణ పాల్గొన్నారు.