ఇండిగో వేసిన కేసుపై కోర్టులో తేల్చుకుంటాం

  • తాము వాడుతున్న ‘6ఈ’ డిఫరెంట్ అంటున్న ఎం అండ్ ఎం

న్యూఢిల్లీ: ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ఇండిగోను  కోర్టులోనే డైరెక్ట్‌‌‌‌గా ఢీ కొట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నిర్ణయించుకుంది.  ‘బీఈ 6ఈ’ ట్రేడ్‌‌‌‌మార్క్‌‌‌‌ను కాపీ కొట్టారని మహీంద్రాపై ఇండిగో కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా అండ్  మహీంద్రా తమ ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీకి ‘బీఈ 6ఈ’ బ్రాండ్‌‌‌‌ పేరు వాడుతోంది.  ‘ తమ బ్రాండ్‌‌‌‌లో 6ఈ వాడినందుకు ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. 

 కానీ, బ్రాండ్ పేరు కేవలం 6ఈ ఒక్కటే కాదు. ఇండిగోకి చెందిన ట్రేడ్‌‌‌‌మార్క్ 6 ఈకి  ఇది డిఫరెంట్ అని నమ్ముతున్నాం. మా రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పూర్తి డిఫరెంట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉంది’ అని ఎం అండ్ ఎం పేర్కొంది.  ఇండిగో అర్థపర్థం లేని వాదనలు చేస్తోందని, ఆల్ఫా–న్యూమరిక్‌‌‌‌తో కూడిన రెండు క్యారెక్టర్ల వాడకంపై ఆధిపత్యం తమకే ఉందని వాదించడం  ఇండస్ట్రీకి మంచిది కాదని అభిప్రాయపడింది. బీఈ 6ఈ బ్రాండ్‌‌‌‌ను కొనసాగించేందుకు కోర్టులో పోరాడతామని తెలిపింది.