హైదరాబాద్, వెలుగు: సోలార్ ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ తన కొత్త ఉత్పత్తి ట్రూజన్ సోలార్ ప్రచారం కోసం నటుడు మహేశ్‌బాబును నియమించుకుంది. పునరుత్పాదక ఇంధన ప్రొడక్టుల అమ్మకాల్లో వచ్చే ఐదేళ్లలో పది రెట్ల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని సన్టెక్ తెలిపింది. ఇప్పటికే ఇళ్లు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు రెండు లక్షలకు పైగా సోలార్ సిస్టమ్స్‌ను అమర్చామని తెలిపింది.
అన్గ్రిడ్, హైబ్రిడ్ రూఫ్‌టాప్, గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్‌లో మొదటిస్థానంలో నిలిచింది. పర్యావరణానికి, సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తున్న ట్రూజన్ సోలార్ బ్రాండ్‌తో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నామని మహేశ్‌బాబు అన్నారు.