కన్నుల పండువగా మహాలక్ష్మి జాతర

కుభీర్ మండలంలోని ధార్ కుభీర్​లో రెండ్రోజులపాటు నిర్వహించిన మహాలక్ష్మి జాతర కన్నుల పండువగా సాగింది. సోమవారం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం చేయగా.. మంగళవారం డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మహాలక్ష్మి ఆలయం నిర్మించినప్పటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవం సందర్భంగా జాతర జరుపుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.   -  వెలుగు, కుభీర్