డీఐఈవో గా మాధవి

మెదక్, వెలుగు: జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈవో)గా మెదక్ బాయ్స్ జూనియర్ కాలేజీ  ప్రిన్సిపల్ మాధవి మంగళవారం అడిషనల్​బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఐఈవో గా పనిచేసిన సత్యనారాయణ ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్న నేపథ్యంలో జిల్లాలో సీనియర్ ప్రిన్సిపాల్ గా ఉన్న మాధవికి అడిషనల్​బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.