బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి కాకతీయ యునివర్సిటీ పరిధిలో ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్‌తోపాటు ఎంకామ్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ అవకాశాన్ని స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని కాలేజ్ ప్రిన్సిపాల్ కాంపెల్లి శంకర్ అన్నారు.
ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిం చారు. పీజీ సెట్ రాసిన విద్యార్థులు అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకు జరుగనున్న రెండో విడత కౌన్సిలింగ్లో కాలేజీలో అందుబాటులో ఉన్న కోర్సులకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9959269975, 9948075400 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.