- పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలో కొత్తగా నిర్మించిన కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవనంలో వర్తకులకు స్టాళ్ల కేటాయింపుపై గురువారం సాయంత్రం లక్కీ డ్రా నిర్వహించారు. చీఫ్ గెస్టు లుగా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో సీనియారిటీ ప్రకారం 54 మంది వర్తకులకు నేరుగా స్టాళ్లు కేటాయించగా, మరో 54 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు.
మార్కెట్ కాంప్లెక్స్‌లో రూ.5 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్లో 108 స్టాళ్లు, 27 షెటర్స్ నిర్మించామన్నారు. మొదటి అంతస్తులోనూ108 స్టాళ్లు, 27 షెటర్స్ నిర్మిస్తున్నన్నామని.. వాటిని ఫిష్, చికెన్, మటన్ అమ్మకందార్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్డీవో హరికృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మునిమంద రమేశ్, బండి ప్రభాకర్ యాదవ్, ప్రదీప్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కూరగాయల అమ్మకందారులు పాల్గొన్నారు.