సిద్దిపేట, వెలుగు: క్లాస్రూమ్స్నిర్మించిన బిల్లు నెలలు గడుస్తున్నా మంజూరు కాకపోవడంతో వాటికి తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన తెలిపిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో గురువారం జరిగింది. గ్రామంలోని ప్రైమరీ స్కూల్ తరగతి గదులను మాంకాల నర్సింలు రూ.9 లక్షలతో నిర్మించారు. దాదాపు ఏడాది కింద నిర్మాణం పూర్తయి ఎన్నికల కోడ్ రావడంతో బిల్లులు మంజూరు కాలేదు.
వేసవి సెలవుల తర్వాత బిల్లు వస్తుందని ఆశించిన కాంట్రాక్టర్కు నిరాశే ఎదురైంది. దీంతో క్లాస్ రూమ్ లకు తాళం వేసి నిరసన తెలిపారు. దీంతో హెచ్ఎం స్టూడెంట్స్కు ఇబ్బంది అవుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తనని తెలపడంతో రెండు గంటల తర్వాత కీస్ ను అందించాడు.