భారీ వాహనాల ఎంట్రీపై ఆంక్షలు ఎత్తివేయాలి

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్​లో రాత్రి వేళలో భారీ వాహనాలపై అటవీ శాఖ విధించిన అంక్షలు ఎత్తివేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్​ను అంక్షల ఎత్తివేత కమిటీ సభ్యులు కోరారు. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపునకు వెళ్తున్న ఎమ్మెల్యేకు మార్గమధ్యంలో జన్నారం మండల కేంద్రంలో కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు.

 ఆంక్షల వల్ల జన్నారం మండలంలోని వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని  హమీ ఇచ్చారు. వినతి పత్రం అందించిన వారిలో కమిటీ సభ్యులు శ్రీరాముల భూమాచారి, కొండపెల్లి మహేశ్, దాసరి తిరుపతి, గోలీ చందు తదతరులున్నారు.