హాస్పిటల్​కు ఎక్విప్​మెంట్ అందజేసిన ఎల్​ఐసీ

హైదరాబాద్​, వెలుగు: మహావీర్ హాస్పిటల్​కు  ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ గుండె చికిత్సా పరికరాలను అందజేసింది.   ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ జోనల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ పునీత్​ కుమార్ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో హాస్పిటల్​ ట్రస్ట్ చైర్మన్ మహేంద్ర కుమార్​రాంకాకు పరికరాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాంకా మాట్లాడుతూ తమ ట్రస్టు కనీస చార్జీలతో ఆసుపత్రిని నిర్వహిస్తోందని వివరించారు.

కార్డియాలజీ విభాగాన్ని ఇటీవలే పునరుద్ధరించామని, డాక్టర్ల సంఖ్యనూ పెంచామని చెప్పారు. సరైన సమయంలో ఎల్​ఐసీ వైద్య పరికరాలను అందజేసిందని ప్రశంసించారు. రోగికి మరింత మెరుగ్గా సేవలు అందించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పారు.  బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మరో కార్యక్రమంలో  పునీత్ కుమార్ హరే కృష్ణ ఉద్యమం ద్వారా వండిన ఆహారాన్ని రవాణా చేయడానికి వెహికల్​ను విరాళంగా ఇచ్చారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌కేఎం ఉపాధ్యక్షుడు మహావిష్ణు వాహనాన్ని స్వీకరించారు