వివేక్ వెంకటస్వామిని కలిసిన లైబ్రరీ చైర్మన్

సుల్తానాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామిని పెద్దపల్లి జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, కాంగ్రెస్ లీడర్ మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కలిసి సత్కరించారు. 

చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో ఉన్న వివేక్ వెంకటస్వామిని ఆదివారం చట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామం వద్ద కలిసి తన నియామకానికి సహకరించినందుకు అన్నయ్యగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరికీ వివేక్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ లీడర్ సజ్జద్ తదితరులు పాల్గొన్నారు.