ఆంధ్రాలో ఎల్‌‌జీ ప్లాంట్‌‌

న్యూఢిల్లీ: ఐపీఓకి రెడీ అవుతున్న ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా   ఆంధ్రప్రదేశ్‌‌లో తమ మూడో ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. కంపెనీకి నొయిడా, పూణెలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్‌‌ ఇండస్ట్రియల్ డెవలప్‌‌మెంట్ పాలసీ కింద  ఆర్థిక సాయాన్ని పొందేందుకు ఇప్పటికే  అనుమతులు వచ్చాయని తెలిపింది. వీలున్నంత వరకు లోకల్‌‌గా రామెటీరియల్స్ సేకరిస్తామని ప్రకటించింది.

 కానీ, కొన్ని రామెటీరియల్స్‌‌ను  చైనా, సౌత్‌‌ కొరియా, జపాన్ నుంచి దిగుమతి చేసుకోక తప్పదని తెలిపింది. ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కిందటి వారం తన ఐపీఓ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది.  పబ్లిక్ ఇష్యూలో  10.18 కోట్ల షేర్ల ( కంపెనీలో 15 శాతం) ను విక్రయించాలని చూస్తోంది. షేరు ప్రైస్ బ్యాండ్‌‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ, రూ.15 వేల కోట్లను ఐపీఓ ద్వారా ఎల్‌‌జీ సేకరిస్తుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే సౌత్‌‌ కొరియన్ వెహికల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా  మార్కెట్‌‌లో లిస్టింగ్ అయ్యింది. ఇండియన్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్న రెండో సౌత్ కొరియన్ కంపెనీగా ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ నిలవనుంది.