మహిళల సమస్యల పరిష్కారానికి లీ హెల్త్‌‌ ‘వి-ఫెరిన్’

హైదరాబాద్‌‌ వెలుగు : సహజ సిద్ధ వనమూలికలు, ఉత్పత్తులతో ఔషధాల తయారీలో ఉన్న హైదరాబాద్‌‌ కంపెనీ లీ హెల్త్‌‌ డొమెయిన్‌‌.. స్త్రీల జననేంద్రియ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ‘వి-ఫెరిన్’ ప్రోబయోటిక్ సప్లిమెంట్‌‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 

లాక్టోఫెర్రిన్ పెప్టైడ్, క్రాన్‌‌బెర్రీ పండ్లతో ప్రీ-ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ మిశ్రమాలతో ఈ క్యాప్సూల్స్‌‌ రూపొందించారు. సహజ బ్యాక్టీరియాను పునరుద్ధరించడంతో పాటు జననేంద్రయ ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుంది.