- వృథాగా పోతున్న నీరు
కడెం,వెలుగు: నిర్మల్‌జిల్లా కడెం ప్రాజెక్టుకు మళ్లీ లీకేజీ బెడద మొదలైంది. ఇటీవలే రూ.9.27 కోట్ల వ్యయంతో కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు చేయగా మళ్లీ నీరు భారీగా లీకవుతోంది. ఇటీవలే రిపేర్లు ముగియడం, ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో మళ్లీ గేట్లకి లీకేజీ ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్టుకు 13,14,15 గేట్ల నుంచి ప్రస్తుతం నీరు లీకవుతోంది. దీంతో రిజర్వాయర్‌లోని నీరంతా వృథాగా పోతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 7.603 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 695.525 నీరు
నిల్వ ఉంది.