మంచిర్యాల, వెలుగు : గ్రామపంచాయతీ లే అవుట్లలో ఇప్పటివరకు రిజిస్ర్టేషన్ కాని ప్లాట్ల రిజిస్ర్టేషన్లను నిలిపివేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 257 సర్య్కులర్‌ను రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ర్ట అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.నర్సయ్య, జనరల్సెక్రటరీ పి.రంగారావుతో పాటు ఆయా జిల్లాల అధ్యక్షులు స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ ఐజీకి మెమోరాండం అందజేశారు.
257 సర్క్యులర్ రిజిస్ర్టేషన్ యాక్ట్‌కు విరుద్ధమంటూ హైకోర్టు గతంలోనే కొట్టివేసిందని, దీనిపై అప్పటి సర్కారు సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిందని తెలిపారు. అప్పటినుంచి రాష్ర్టవ్యాప్తంగా సుమారు 2లక్షల ప్లాట్లు రిజిస్ర్టేషన్ కాకుండా ఆగిపోవడంతో డెవలపర్లు, ప్లాట్లుకొన్నవారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకొని 257 సర్క్యులర్‌ను రద్దు చేస్తూ రిజిస్ర్టేషన్లకు అనుమతించాలని కోరారు.