ఆదిలాబాద్ , వెలుగు: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఐటీయూ కాలేజ్ స్టూడెంట్స్, కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ ముందు సోమవారం వేర్వేరుగా ధర్నాలు చేశారు. ఐటీఐ కాలేజీలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు డిమాండ్చేశారు. వారికి ఏబీవీపీ నాయకులు మద్దుతుగా ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. నల్ల జెండాలతో నిరసన
చేపట్టారు.