చిన్నారులను అంగన్ వాడీలో చేర్పించాలి

కోల్​బెల్ట్/ఖానాపూర్, వెలుగు: ఐదేండ్లు లోపు చిన్నారులను అంగన్ వాడీలో చేర్పించాలని నేతలు, అధికారులు కోరారు. క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు,​గ్రామాల్లో శుక్రవారం అమ్మ మాట అంగన్​వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కాకతీయకాలనీ 1,2 కేంద్రాలు,  ఇందిరానగర్, పోచమ్మ బస్తీ, కాళీనగర్, సుభాష్​నగర్​-1​  పరిధిలో అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లులతో ర్యాలీ నిర్వహించారు.

చిన్నారులను అంగన్​వాడీ కేంద్రాలకు పంపించడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో మందమర్రి ఎంపీడీవో రాజేశ్వర్, ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి, సూపర్​వైజర్లు సరిత, అంగన్​వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఖానాపూర్​పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలో అమ్మ మాట, అంగన్ వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని అంగన్ వాడీలో చదువుతున్న చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు. అంగన్ వాడీలో చదివే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి పోషకాహారం అందిస్తున్నట్లు ఖానాపూర్​పట్టణ కాంగ్రెస్​అధ్యక్షుడు నిమ్మల రమేశ్​అన్నారు. నాయకులు తోట భీమేశ్,  శ్రీపాద శేషాద్రి, మెప్మా వరలక్ష్మి, అంగన్ వాడీ టీచర్ ధనలక్ష్మి తదితరులు ఉన్నారు.