ఈ నెల 25 నుంచి అంతర్జాతీయ సహకార సదస్సు

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ సహకార సదస్సు 2024ను అంతర్జాతీయ సహకార కూటమి, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ఇఫ్కో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం 2024 నవంబర్ 25 నుంచి 30 వరకు ఢిల్లీలో జరగనుంది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్ ప్రధాన మంత్రి దాషో షెరింగ్ టోబ్గే జీ,  ఫిజీ ఉప– ప్రధాన మంత్రి మనోవా కమికామికా కూడా హాజరవుతున్నారని ఇఫ్కో తెలిపింది.