మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా సీఎస్ఐ ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాంతయ్య  దైవసందేశాన్ని అందించారు.

హైదరాబాద్​, రంగారెడ్డి, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక వంటి దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి ఆవరణలో చెట్ల కింద వంటలు చేసుకొని ఆనందంగా గడిపారు.