ఆసిఫాబాద్, వెలుగు: వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్ట్‌లో భారీగా నీరు చేరింది. దీంతో మంగళవారం నీటిపారుదల శాఖ అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు సామర్థ్యం 10.39 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.93 టీఎంసీల నీరు ఉంది.
ప్రాజెక్టులోని 642 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4,5 గేట్ల ద్వారా 652 క్యుసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.