జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్​గా విశ్వనాథరావు

జైనూర్, వెలుగు: జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్​గా సిర్పూర్ యు మండలం పాముల్​వాడకు చెందిన కుడమెత విశ్వనాథరావు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్లు జైనూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. మండలంలోని అడా నీళ్లబాయి, మండాడి లింగరాజ్, అడా రాజేశ్, పంద్రం షేక్ డైరెక్టర్లుగా ఉన్నారు.

 కుడమెత విశ్వనాథ్ ఏజెన్సీ నుంచి కీలక నాయకునిగా, ఎస్టీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వహించారు. మార్కెట్ కమిటీ పరిధిలోని ఉట్నూర్, జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల రైతులకు న్యాయం చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఆయన తెలిపారు.