ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి :  క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్ లో 153 మంది సూపర్​వైజర్లకు, 173 మంది సహాయకులకు ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఏర్పాటు చేశారు. రెండో శిక్షణ కార్యక్రమంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు.  కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, కామారెడ్డి అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు రాజు, పాండు, అశోక చక్రవర్తి, మాస్టర్ ట్రైనర్ కృష్ణకుమార్, కౌంటింగ్ సూపర్​వైజర్లు, సహాయకులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

15000 ఎకరాల్లో మామిడి సాగు

మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి పట్టణంలో ఉద్యాన వనశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మామిడిపళ్ల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రైతాంగం క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యాన శాఖ, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్,  శైలజ, కీర్తి, శాస్త్రవేత్తలు సుచిత్ర, హరిశాంత్, మాధవి, మౌనిక, నితీశ్, యుగంధర్ పాల్గొన్నారు.