రైతు సంక్షేమమే సర్కార్ ధ్యేయం

ఆసిఫాబాద్, వెలుగు :  రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని  రాష్ట గిరిజన సహకార సంఘం చైర్మన్ కొట్నాక తిరుపతి అన్నారు.  రెబ్బెన మండల కేంద్రంలోని కె కె గార్డెన్స్ లో  బుధవారం ప్రజా పాలన వారోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు  మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని తెలిపారు.

ఈకార్యక్రమంలో ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ డా. బెల్లాయ్య నాయక్ తేజవాత్ , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు,ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్ చార్జ్  శ్యామ్ నాయక్, మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్​, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావు పాల్గొన్నారు.