కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం సాయంత్రం నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం మండపంలో బారులుతీరారు. మల్లన్న స్వామికి బోనాలు సమర్పించి, గంగరేగు చెట్టు దగ్గర పట్నాలు వేసి, నిత్య కల్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. అనంతరం మల్లన్న కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ ఈవో బాలాజీ, ఏఈవోలు, గంగ శ్రీనివాస్, బుద్ధి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.