భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామ స్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. అనంతరం నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లి బోనం సమర్పించారు. మరికొంతమంది భక్తులు మల్లన్నకు అభిషేకం చేసి, ఒడిబియ్యం పోసి, కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. 

కాగా  గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేయగా వర్షానికి తడిసిపోయాయి. వరదనీటికి భక్తులు తడిసి నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన సందర్భంలో పట్నాలు తడవకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరారు.