కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి

  • మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు 

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం సాయంత్రం నుంచే తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్నస్వామి నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తులు మల్లన్న కోనేరులో స్నానాలు చేసి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు.

అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.