భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న అలయం

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి ఆలయ పరిసరాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే మల్లన్న కోనేరులో స్నానాలు ఆచరించి ఒక్కపొద్దులతో స్వామికి నైవేద్యం వండి డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి బోనం సమర్పించారు.

అనంతరం గంగిరేగి చెట్టు వద్ద పట్నాలువేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.