సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కోలా అర్పిత సివిల్ సర్వీసెస్ లో 639 ర్యాంకు సాధించినందుకు ఆదివారం  గ్రామస్తులు సన్మానించారు. గ్రామంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి చెందిన అర్పిత జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అర్పిత తల్లిదండ్రులు అమర్ సింగ్, రేణుక, గ్రామస్తులు పాల్గొన్నారు.