రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని ఆదివారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్​ను అడిగి తెలుసుకున్నారు.

 ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని  సూచించారు. భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేశ్ రెడ్డి తదితరులున్నారు.