నేరడిగొండ, వెలుగు : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కేజీబీవీ ఎస్ఓ రజిత డిమాండ్ చేశారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆదేశాల మేరకు నేరడిగొండ మండల కేంద్రంలోని కేజీబీవీలో సమగ్ర శిక్షలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగులకు సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు భద్రత లేదన్నారు.
చాలీచాలని జీతాలు, కుటుంబ పోషణ భారాన్ని మోయలేక మానసిక ఒత్తిడితో గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో నెలకు ఇద్దరి చొప్పున చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు అందజేయాలని, చనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.