చింతమడకలో ఓటేసిన కేసీఆర్

  •     కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర: మాజీ సీఎం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మండలం చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేశాక బయటికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని అన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బీజేపీ తయారు చేసుకున్న సొంత నిబంధనల ప్రకారం 75 ఏండ్లు దాటిన వారు ఎలాంటి పదవులు చేపట్టరాదని, ఈ రూల్ ప్రకారం నరేంద్ర మోదీ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీకి పరాభవం తప్పదని, కేంద్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం తాము ఏ కూటమిలో భాగస్వాములం కాదన్నారు.