పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మే 8న పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో జరగనుందని సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని, రికార్డు మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్రోడ్ షో జరగనున్న ఇస్నాపూర్ చౌరస్తాను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, ముత్తంగి మాజీ సర్పంచ్ ఉపేందర్, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా, మెరాజ్ ఖాన్, సందీప్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, అబేద్, తులసి గౌడ్ పాల్గొన్నారు.