స్వయంగా వ్యాన్ నడిపిన కేసీఆర్.. ఫోటో వైరల్

తెలంగాణ మాజీ సీఎం,  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్వయంగా వ్యాన్ నడిపారు.  కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహయంతో  కేసీఆర్ నడుస్తోన్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.  ఈ క్రమంలో మ్యానువల్ గా కారు నడపమని వైద్యులు సూచించడంతో ఆయన  తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపారు. దీనికి సంబంధించిన  ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కేసీఆర్  త్వరగా కోలుకుంటు ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ బాత్ రూమ్ లో కాలుజారి కిందపడడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటినా సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం.. తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ స్టిక్ తోనే నడుస్తున్నారు.