కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.  ఒక్క ఉచిత బస్సు అమలు చేస్తే దాని వల్ల ఆడవాళ్లు కొట్టుకొని చస్తున్నారని విమర్శించారు.  మెదక్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. టీడీపీ,కాంగ్రెస్ హాయంలో ఘనపూర్ ఆనకట్టను సర్వనాశనం చేశారన్న కేసీఆర్..  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఘనపూర్ ఆయాకట్ట ఎత్తును పెంచుకున్నామని చెప్పారు. మెదక్ హల్దీవాగు పైన ఎన్నో చెక్ డ్యాంలు కట్టించామని తెలిపారు.  

పదేళ్ల కింద మోడీ వంద హామీలు ఇచ్చారని..  అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు కేసీఆర్.  బీజేపీ ఎజెండాలో పేదల బాధలు,కష్టాలు ఏమి ఉండవన్నారు. మోడీ గోదావరి నదిని తమిళనాడుకు అప్పజెప్పుతానని అంటున్నాడని చెప్పారు. కృష్ణ నదిని ఇప్పటికే రేవంత్ సర్కార్ కేఆర్ ఎంబీకి అప్పజెప్పిందని ఆరోపించారు.  ఉన్న ఒక్క గోదావరి తమిళనాడుకు పోతే మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.  బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ చేతిలో 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడని..  అసెంబ్లీకి చెల్లని రూపాయి పార్లమెంట్ కి ఎలా చెల్లుతాడని ప్రశ్ని్ంచారు కేసీఆర్.