నవంబర్ 1 నుంచి క్యాతనపల్లి రైల్వే గేట్ బంద్

కోల్​బెల్ట్, వెలుగు:​ మంచిర్యాల–రామకృష్ణాపూర్​రహదారి లోని క్యాతనపల్లి రైల్వే గేటును నవంబర్​1 నుంచి వారంరోజుల పాటు మూసివేయనున్నట్లు  రైల్వేశాఖ ఆఫీసర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

క్యాతనపల్లిలోని 57వ రైల్వే గేటు వద్ద ట్రాక్​నిర్మాణం, రిపేర్లు  చేపడుతున్న నేపథ్యంలో నవంబర్​7 వరకు రైల్వే గేటు మూసివేస్తామని తెలిపారు. వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు సహకరించాలని కోరారు.