మంచిర్యాలలో వైభవంగా కట్ట పోచమ్మ బోనాలు

మంచిర్యాల అశోక్ రోడ్​లోని కట్ట పోచమ్మ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హమాలివాడలోని హనుమాన్, సాయిబాబా ఆలయాల నుంచి మహిళలు బోనాలు ఎత్తుకుని పోచమ్మ టెంపుల్​వరకు శోభాయాత్ర జరిపారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న జోగిని శ్యామల స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​ రావు కొడుకు చరణ్​రావు, కోడలు శైలేఖ్య పాల్గొన్నారు. శైలేఖ్య బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.   -

 వెలుగు, మంచిర్యాల