మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద కస్తూర్భా స్కూల్​ తనిఖీ

నిర్మల్ జిల్లా  సోఫీనగర్  కస్తూర్బా గాంధీ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు.  కొన్ని సమస్యలతో సతమతమవుతున్నామని పలువురు విద్యార్థినులు చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు.

దీనికి స్పందించిన చైర్​ పర్సన్ సంబంధిత కేర్ టేకర్ ను పిలిపించి విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇలాంటి సమస్యలు పునరావృతమైతే కఠిన చర్యలు చేపడుతామని  హెచ్చరించారు.

ALSO READ | మంచిర్యాల జిల్లాలో  ఉత్సాహంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు