ఆదిలాబాద్ జిల్లాలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు

  • దీపారధనకు వందలాదిగా తరలివచ్చిన భక్తులు

నెట్ వర్క్ , వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఆదిలాబాద్​ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి వేడుకలను శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చి కాగడ హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ దంపతులు హాజరై పూజలు చేశారు. మహిళలు, యువతులు ఆలయ ఆవరణలో ప్రత్యేక దీపాలంకరణ చేశారు. మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆలయంలో సామూహికంగా కాగడ హారతులు వెలిగించి భక్తి గీతాలు ఆలపించారు.