కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలి : ఎమ్మెల్యే మానిక్ రావు

జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ నియోజవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , షాదీ ముబారాక్ చెక్కులు వెంటనే అందించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతిపత్రం అందజేసినట్లు ఎమ్మెల్యే మానిక్ రావు తెలిపారు.

మంగళవారం హైదరాబాద్ లోని  స్పీకర్ ఛాంబర్​లో ఆయనను కలిసి సమస్యలు వివరించినట్లు తెలిపారు. ఏడు నెలలుగా చెక్కుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని దీని వల్ల ఆర్థిక సాయం అందక అయా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఇప్పటికే 900 పైగా చెక్కుల గడువు తేదీ ముగిసిందన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్,ఆర్డీవో దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు చెప్పారు.