కాగజ్‌నగర్, వెలుగు: ఆటల్లో బాక్సింగ్ కు ప్రత్యేక స్థానం ఉందని కాగజ్ నగర్ టౌన్ సీఐ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని సర్ సిల్క్ ఎఫ్ కాలనీలో ముత్తు మెమోరియల్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బాక్సింగ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. హాజరైన సీఐ.. ఇటీవల జరిగిన బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు అవార్డులు, బహుమతులు అందజేశారు.
బాక్సింగ్ నేర్చుకోవడం వలన శరీర దారుఢ్యంతో పాటు ఆత్మ స్థైర్యం పెరుగుతుందన్నారు. బాక్సింగ్ క్లబ్ అధ్యక్షుడు వేముర్ల మధు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చైర్మన్ శివకుమార్ నాయర్, ప్రధాన కార్యదర్శి మధురై శేఖర్ మాస్టర్, కోశాధికారి రమాకాంత్ యాదవ్, ఉపాధ్యక్షుడు జయేందర్, ప్రొఫెసర్ వాలెంటెనా పాల్గొన్నారు.