ఫారెస్ట్ భూమిలో వేసిన పంట తొలగింపు

  • మండిపడుతున్న రైతులు

కాగజ్ నగర్, వెలుగు: అడవులను రక్షించేందుకు పోడు రైతులు, ప్రజలు సహకరించాలని కాగజ్ నగర్ ఇన్​చార్జి రేంజ్ ఆఫీసర్ శశిధర్ బాబు కోరారు. ఫారెస్ట్ భూముల ఆక్రమణ, పంటల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగజ్ నగర్ రేంజ్ రాస్పల్లి సెక్షన్ కడంబ బీట్​లోని కంపార్ట్​మెంట్ 129లో కొందరు రైతులు అక్రమంగా సాగు చేస్తున్న పంటలను సిబ్బందితో కలిసి తొలగించారు.

 గతంలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటగా అందులో కంది పంట వేశారని వాటిని తొలగించినట్లు చెప్పారు. అయితే తమకు పట్టాలున్నాయని, ఏండ్లుగా సాగుచేస్తున్న భూములను అధికారులు ఫారెస్ట్ భూములను లాక్కుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. 2 నెలల క్రితం వేసిన పంటను ఇప్పుడు తొలగించి నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు రైతులకు చెందిన సుమారు 6 ఎకరాల్లో సాగు చేసిన పంటను తొలగించారు.