కడెం ప్రాజెక్ట్‌కు భారీ వరద.. మూడు గేట్లు ఎత్తిన అధికారులు

నిర్మల్ జిల్లా : గోదావరి నదికి ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తుతోంది. నిర్మల్ జిల్లా జన్నారం మండలంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇన్ ఫ్లో పెరగడంతో 3 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 690.400 అడుగులు ఉంది. కడెం ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో  15538 క్యూసెక్కులు వరుద నీరు వస్తుంటే.. ఔట్ ఫ్లో  11022 క్యూసెక్కులు నీరు దిగువకు వదులుతున్నారు. దిగువ మంచిర్యాల జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలోని జాలర్లు, పశువుల కాపర్లు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.