జిల్లాకు ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలతో కడెం, స్వర్ణ ప్రాజెక్టులోకి వరద పెరిగింది. కడెం ప్రాజెక్టులోకి 12,637 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ఐదు గేట్లు ఎత్తి 33 వేల 664 క్యూసెక్కుల నీరును వదులుతున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టు లోకి కూడా 2000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తున్నంతో గేట్లను ఎత్తిన దిగివకు వదిలేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కాగా ఈ రెండు ప్రాజెక్టుల లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రెండు రోజులపాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. - నిర్మల్, వెలుగు