మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి : మంజుల 

సిద్దిపేట, వెలుగు: వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్​సరఫరా చేయాలని చైర్ పర్సన్ కడవెరుగు మంజుల విద్యుత్​అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో 31 అంశాలను పాలక మండలి ఆమోదిందించింది. ఈ సందర్భంగా  కౌన్సిల్ సభ్యులు పలు సమస్యలను చైర్ పర్సన్ దృష్టికి తీసుకురాగా వాటి  పరిష్కారానికి చైర్​పర్సన్​హామీ ఇచ్చారు.

కాగా మున్సిపల్ ఎజెండా ప్రకారం కాకుండా టేబుల్ ఎజెండాను ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ  ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే  ఫండ్ నుంచి కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయించాల్సి ఉండగా మున్సిపల్ నిధులను కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

పట్టణ ప్రగతికి సంబంధించిన నిధులను పక్క దారి పట్టిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మున్సిపల్​ఆఫీసు ముందు బైఠాయించి చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జయ, బాలలక్ష్మి, శ్రీదేవి, రియాజ్, కవిత, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు.