రిటైర్డ్ జవాన్ల విషయంలో చొరవ చూపాలి

కాగజ్ నగర్, వెలుగు: ఆర్మీ రిటైర్డ్ జవాన్లు మీటింగ్ పెట్టుకునేందుకు కనీసం కమ్యూనిటీ హాల్ కూడా లేదని, దీంతో ఇతర ఆఫీసుల్లో నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ చొరవ చూపి స్థలం కేటాయించాలని జిల్లా ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శివ కోరారు. మూడు నెలలకోసారి చేపట్టే సమావేశం ఆదివారం ఈస్ గాంలో నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్స వాన్ని జరుపుకునేందుకు సరైన స్థలం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. విషయంపై పలుమార్లు కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశా మని,  అయినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ లు స్పందించి కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించాలని కోరారు.