కొత్త కోర్టులతో కేసులకు సత్వర పరిష్కారం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కోర్టులతో పెండింగ్ లో ఉన్న కేసులు ఎక్కువ మొత్తంలో త్వరగా పరిష్కారం అవుతాయని హైకోర్టు జడ్జి, జిల్లా కోర్టుల పరిపాలనాధికారి జస్టిస్​ కె.శరత్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన నూతనంగా జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించారు.

అంతకుముందు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్​రావు, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.