ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఉద్యోగి

  • రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన నిర్మల్​ మున్సిపాలిటీ జూనియర్​ అసిస్టెంట్​ ​

నిర్మల్, వెలుగు : లంచం తీసుకుంటుండగా నిర్మల్  మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలో జూనియర్  అసిస్టెంట్ గా పని చేస్తున్న ఎంఏ  షాకీర్ ఖాన్ ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్  హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే ఆఫీసులో పని చేస్తున్న చందుల భరత్  అనే బిల్  కలెక్టర్  నుంచి సర్వీస్  రెగ్యులరైజేషన్  కోసం షాకీర్ ఖాన్  రూ.20 వేలు డిమాండ్  చేశారు. మొదట రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న భరత్  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచన మేరకు డబ్బులు ఇవ్వగా, ఏసీబీ డీఎస్పీ బీవీ రమణమూర్తి, ఇన్స్​పెక్టర్  కృష్ణ కుమార్  పట్టుకొని అరెస్ట్​ చేశారు. ఈ ఏడాది జనవరిలో ఇదే ఆఫీసులో రెవెన్యూ ఆఫీసర్ గా పని చేస్తున్న గంగాధర్, బిల్  కలెక్టర్  నవాంత్  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 10 నెలల్లోనే మరోసారి జూనియర్  అసిస్టెంట్  ఏసీబీకి పట్టుబడడం గమనార్హం.