ఓరియంట్​ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: మాజీ ఎమ్మెల్సీ

కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలోని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ, ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు సి.రాములు నాయక్ డిమాండ్​ చేశారు. కంపెనీని అదానీ గ్రూప్ కు అమ్మడాన్ని నిరసిస్తూ ఆయన మంగళవారం ఉదయం 24 గంటలకు దీక్షకు దిగారు.  ఓసీసీని అదానీకి అమ్మడంతో కార్మికులకు భద్ర త లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సీకే బిర్లా యాజమాన్యం ఆధ్వర్యంలోనే నడిపించాలని కోరారు.  దేవాపూర్ పరిసర గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను, గత హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొన్నారు.  భూ నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో ఫ్రీ కరెంట్, వాటర్​సప్లై చేయాలని, నాలుగో ప్లాంట్​ను ఏర్పాటు చేసి 4వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్​చేశారు. యూనియన్ నేతలు తట్ర భీంరావు,  వై.శ్రీనివాస్,  ఎస్.రాజయ్య, ఆర్.శేఖర్, సీహెచ్.తిరుపతిరెడ్డి, గణేశ్, ఎం.గంగారం పాల్గొన్నారు.