సంగారెడ్డి జిల్లాలో జూలై 4న జాబ్ మేళా

సంగారెడ్డి టౌన్ , వెలుగు:  జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి వందన ఒక ప్రకటన తెలిపారు. కావేరి ఎంటర్​ప్రైజెస్​ లో 40 ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. 18 నుంచి 35 ఏళ్ల  వయసున్న ఐటీఐ  వెల్డర్, ఫ్యాబ్రికేషన్ ఇంటర్ అర్హత కలిగిన వారు అర్హులని తెలిపారు.

సర్టిఫికెట్లు, ఆధార్ , క్యాస్ట్ జిరాక్స్ కాపీలతో సంగారెడ్డి లోని  జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హాజరు కావాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాల కోసం 08455 271010 ను సంప్రదించాల్సిందిగా కోరారు.